ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Ys sharmila | త‌న త‌ప్పు లేదంటున్న జ‌గ‌న్.. విచార‌ణ చేయ‌మ‌ని ఎందుకు అడ‌గ‌ట్లేద‌న్న ష‌ర్మిల

    Ys sharmila | త‌న త‌ప్పు లేదంటున్న జ‌గ‌న్.. విచార‌ణ చేయ‌మ‌ని ఎందుకు అడ‌గ‌ట్లేద‌న్న ష‌ర్మిల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ys Jagan | గత ఎన్నికల ముందు నుంచే అన్న వైఎస్ జగన్ (Ys Jagan)తో విభేదిస్తూ వచ్చిన వైఎస్ షర్మిల(YS Sharmila) ఛాన్స్ దొరికిన‌ప్పుడల్లా ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తూ ఉంటుంది. తల్లిపై కేసు వేసిన కొడుకుగా.. మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారంటూ అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు కురిపించింది ష‌ర్మిల.అయితే తాజాగా జ‌గ‌న్‌పై మ‌రోసారి నిప్పులు చెరిగింది ష‌ర్మిల. తాను తప్పు చేయలేదని చెబుతోన్న జగన్ ఏ ఎంక్వైరీ అయినా చేసుకోవాలని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

    Ys sharmila | ష‌ర్మిల ప్ర‌శ్న‌ల వ‌ర్షం..

    ఆయన అలా చెప్పకపోవడాన్ని బట్టి జగన్ దోషి అని ప్రజలకు తెలుస్తోందని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్(YSR) సీఎంగా ఉన్నప్పుడు తన తప్పుంటే విచారణ చేసుకోవాలని చెప్పేవారని కానీ జగన్ అలా చెప్పలేకపోతున్నారని అన్నారు. పైగా తన వెనుక ఉన్న వారంతా మచ్చలేని మనుషులు అని జగన్ వెనుకేసుకొస్తున్నారని షర్మిల మండిపడ్డారు. జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రి అని.. అయితే, ఆయన ఆ హోదా మరిచి మాట్లాడుతున్నారని షర్మిల(Sharmila) విమర్శించారు. గతంలో జగన్ పోలీసులను బట్టలు ఊడదీస్తా అని అన్నారని అయితే, అలా మాట్లాడటం ఏ మాత్రం బాగోలేదంటూ షర్మిల కామెంట్స్ చేశారు.

    ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను Police ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు. ఆ విషయంపై ఇప్పటి డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణం రాజు, కాదంబరి జిత్వానీ కూడా మరిచి పోలేదు’అని పేర్కొన్నారు. ‘లిక్కర్ అవినీతిలో మీ తప్పు లేకుంటే అసెంబ్లీకి వెళ్లి మాట్లాడండి.. లిక్కర్ స్కాం(Liquor scam)లో అవినీతి లేదు అనుకుంటే అసెంబ్లీ సాక్షిగా విచారణ వేయమని డిమాండ్ చేయండి.. ACB లేదా CBIతో విచారణ కోరండి’ అంటూ జగన్‌కు షర్మిల సూచించారు. మీ హయాంలో డిజిటల్ పేమెంట్ ఎందుకు చేయలేదో చెప్పాలని, అలాగే దమ్ముంటే విచారణ కోరాలని సవాల్ చేశారు. మొత్తానికి ష‌ర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

    More like this

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్...

    Moneylenders | బడా వడ్డీ వ్యాపారులపై చర్యలేవి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Moneylenders | వడ్డీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్​ కమిషనరేట్​ పోలీసులు (Nizamabad...

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...