అక్షరటుడే, వెబ్‌డెస్క్: YS Jagan | సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao) అరెస్ట్‌పై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. కొమ్మినేని నిర్వహించే చర్చలో జర్నలిస్టు క్రిష్ణంరాజు(Journalist Krishnam Raju) చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదయ్యాయి. కృష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. చర్చ నిర్వహించిన కొమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించిన జగన్ సోషల్ మీడియా ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. కొమ్మినేని అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందంటూ ఆరోపించారు.
YS Jagan | జగన్ స్పందన..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అవుతున్నాయని.. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని వైఎస్ జగన్(YS Jagan) ఆరోపించారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచక, అన్యాయ పాలనపై ప్రజల తరఫున ఎవరూ గొంతెత్తకుండా అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. తన దుర్మార్గపు పాలన, మోసాలు, అవినీతి, వైఫల్యాలపై స్వరం వినిపించకుండా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలంగా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu)చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారిని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని.. ఆరోపించారు. ‘సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్(Debate)లో వ్యక్తులు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియా(Sakshi Media)పైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిగారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టారని’ చెప్పుకొచ్చారు.