Homeఆంధప్రదేశ్YS Jagan | జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌.. ఈ సారి ఎన్ని రోజులు, టూర్ కార‌ణ‌మేంటి?

YS Jagan | జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌.. ఈ సారి ఎన్ని రోజులు, టూర్ కార‌ణ‌మేంటి?

YS Jagan | ప్రస్తుతం రాజకీయంగా విరామ దశలో ఉన్న వైఎస్ జగన్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కి వెళ్లారు. ఈ పర్యటన ఉద్దేశం కుటుంబంతో కొంత స‌మ‌యం గ‌డ‌పాల‌నుకోవడం. ఈ నెల‌లోనే భార‌త్‌కి తిరిగి రానున్న జ‌గ‌న్ నవంబర్ నుండి కోర్టు వ్యవహారాలు, పార్టీ రీస్ట్రక్చరింగ్‌పై దృష్టి సారించనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయల్దేరారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఆయన శుక్రవారం రాత్రి బెంగళూరు(Bangalore) నుంచి లండన్ కు పయనమయ్యారు.

కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపేందుకు ఈ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. విదేశీ పర్యటనకు వెళ్లడం జగన్‌(YS Jagan)కి కొత్తేమీ కాదు కానీ, ఈసారి మాత్రం పూర్తిగా వ్యక్తిగత ప్ర‌యోజ‌నం కోస‌మే వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. ఆయన పెద్ద కుమార్తె హర్ష, ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. ఫ్రాన్స్‌లో MBA పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం లండన్‌లో ఉన్నత విద్య కొనసాగిస్తున్నారు.

YS Jagan | కోర్టు అనుమతి తర్వాతే పర్యటన

అదే సమయంలో ఆయన చిన్న కుమార్తె వర్ష కూడా అమెరికాలోని నోట్రెడామ్ యూనివర్శిటీలో హయ్యర్ స్టడీస్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తాజా టూర్‌ ద్వారా కుటుంబం అంతా లండన్‌(London)లో ఫ్యామిలీ రీయూనియన్ కావాలని భావిస్తున్నారు.వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల సీబీఐ కోర్టు(CBI Court)ను ఆశ్రయించారు. గతంలోనూ పలు సందర్భాల్లో జగన్ విదేశీ పర్యటనకు ప్రయత్నించినప్పటికీ పాస్‌పోర్ట్ మరియు కోర్టు అనుమతుల సమస్యల వల్ల టూర్ వాయిదా పడింది. తాజాగా ఆయన అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్యలో యూరప్ టూర్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది.

వైఎస్ జగన్‌కు అనుమతితో పాటు 18 కండిషన్లు కూడా విధించాయి సీబీఐ కోర్టు. ముఖ్యంగా, పర్యటన ముగిసిన తర్వాత నవంబర్ 1వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. గత ఐదేళ్లుగా వర్చువల్‌గా హాజరవుతున్న జగన్, ఈసారి మాత్రం పర్సనల్‌గా కోర్టుకు హాజరుకానున్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాల్లో తీవ్రంగా ఓటమి ఎదుర్కొన్న వైఎస్ జగన్, పార్టీ పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ, మధ్యలో ఇలా కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఇది ఆయన పునర్వ్యవస్థీకరణలో భాగమైన మానసిక విశ్రాంతిగా భావిస్తుండగా, మరికొందరు వచ్చే రాజకీయ కార్యక్రమాలకు ముందు తీసుకున్న ఫ్యామిలీ బ్రేక్‌గా విశ్లేషిస్తున్నారు. వైఎస్ జగన్ దంపతులు అక్టోబర్ 23న భారత్‌కు తిరిగి రానున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం నవంబర్ మొదటి వారం నుంచి ఆయన కోర్టు విచారణలో ప్రత్యక్షంగా హాజరుకానున్నారు.