HomeUncategorizedOdisha | వీడియో కోసం వెళ్లి.. జలపాతంలో కొట్టుకుపోయిన యూట్యూబర్​..

Odisha | వీడియో కోసం వెళ్లి.. జలపాతంలో కొట్టుకుపోయిన యూట్యూబర్​..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | సెల్ఫీలు, వీడియోలు, రీల్స్​ కోసం కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఓ యువకుడు రీల్స్​ కోసం ఫ్లై ఓవర్​పై (Flyover) నుంచి దూకగా తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా ఓ యూట్యూబర్​ వీడియో కోసం జలపాతంలోకి దిగి కొట్టుకుపోయాడు.

దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో నదులు, జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్ట్​లు నిండుకుండలా మారాయి. దీంతో ఆయా ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు వెళ్తున్నారు. ఈ క్రమంలో సెల్ఫీలు, వీడియోల కోసం వెళ్లి ప్రమాదాల బారీన పడుతున్నారు. అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా నీళ్లలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఒడిశాలోని కొరాపుట్ జిల్లా డుడుమా జలపాతం (Duduma Waterfalls) ఓ యువకుడు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు.

Odisha | మిత్రులు చూస్తుండగానే..

కొంతమంది స్నేహితులు జలపాతం అందాలను తిలకించేందుకు వెళ్లారు. అందులో యూట్యూబర్​ (Youtuber) అయిన ఓ యువకుడు జలపాతం అందాలను కెమెరాలో బంధించాలనికి ఫోన్ పట్టుకొని నీళ్లలోకి వెళ్లాడు. వీడియో తీస్తున్న టైంలో ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అక్కడే చిక్కుకుపోయాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేయగా.. నీటి ప్రవాహం మరింత పెరగడంతో యువకుడు కొట్టుకుపోయాడు. తమ కళ్లముందే స్నేహితుడు మృతి చెందడంతో మిగతవారు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ వీడియో సోషల్​ మీడియా (Social Media)లో వైరల్​గా మారింది.

Odisha | ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

సెల్ఫీలు, రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు పడటంతో వరద ఉధృతంగా ఉందని, నదులు, జలపాతాల్లోకి దిగొద్దని చెబుతున్నారు. అలాగే చెరువులు, డ్యామ్​లలో సైతం ఈతకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. సోషల్​ మీడియా మోజులో తల్లిదండ్రులకు వేదన మిగల్చొద్దని సూచిస్తున్నారు.