HomeసినిమాBig Boss Season 9 | బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ ఫిర్యాదు.. ఈ షో...

Big Boss Season 9 | బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ ఫిర్యాదు.. ఈ షో సమాజాన్ని తప్పుదోవ ప‌ట్టిస్తుందంటూ హితవు

బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని, కుటుంబ విలువలు పాటించని వారిని ఎంచుకుంటున్న బిగ్ బాస్ టీమ్ సమాజం సిగ్గు పడే విధంగా షో నిర్వహిస్తున్నార‌ని విమర్శిస్తూ, వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Big Boss Season 9 | బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే తెలుగులో 8 సీజ‌న్స్ పూర్తి చేసుకోగా, ప్ర‌స్తుతం సీజ‌న్ 9 ప్ర‌సారం అవుతుంది. నాగార్జున హోస్ట్‌గా న‌డుస్తున్న ఈ షోలో రీసెంట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జ‌రిగింది.

దీంతో హౌజ్ ర‌ణ‌రంగంగా మారింది. అయితే బిగ్ బాస్ సీజన్ 9 (Big Boss Season 9) ను నిలిపివేయాలంటూ గజ్వేల్‌కు చెందిన కొందరు యువకులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో (Jubilee Hills Police Station)కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్ వంటి యువకులు బిగ్ బాస్ షోను సమాజాన్ని తప్పుదోవపెట్టే విధంగా నిర్వహిస్తున్నందుకు ఫిర్యాదు చేశారు.

Big Boss Season 9 | బ్యాన్ చేయాలంటూ డిమాండ్..

బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే ప్రతీ కంటెస్టెంట్ సమాజంలో విలువలేని వ్యక్తి అని అన్నారు. కుటుంబ విలువలను పాటించని వ్యక్తులను మాత్రమే షోలో పెట్టడం వల్ల, సమాజానికి సిగ్గు తెచ్చే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని వారు పేర్కొన్నారు. ఫిర్యాదులో బిగ్ బాస్ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. “బిగ్ బాస్ షోపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి షోను ముట్టడిస్తాము. కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చేయాలి. నాగార్జున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. దివ్వెల మాధురి (Divvela Madhuri), రీతూ చౌదరి (Reetu Chaudhary) లాంటి వారిని సెలక్ట్ చేయడం వల్ల సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు?” అని వారు ప్రశ్నించారు.

బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం అయి ఇప్పటికే 39 రోజులు పూర్తయాయి. ఈ సమయంలో కొందరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు కూడా వచ్చారు. ఇలాంటి స‌మ‌యంలో సోషల్ మీడియా, ప్రజా వర్గాలలో ఈ ఫిర్యాదు వైరల్ అవడంతో, షోపై చర్చలు మరింత ఉధృతమవుతున్నాయి. గ‌తంలో కూడా బిగ్ బాస్ షోపై అనేక విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నాగార్జున‌ (Nagarjuna)పై కూడా కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన కూడా ఈ షో స‌క్సెస్ ఫుల్‌గానే సాగుతుంది.