అక్షరటుడే, బోధన్: National Unity Day | యువత సన్మార్గంలో నడిచి దేశానికి ఆదర్శంగా నిలవాలని బోధన సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవంలో భాగంగా బోధన్ పోలీసుల ఆధ్వర్యంలో 2కేరన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రన్లో సబ్ కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న 2కే రన్ పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
National Unity Day | పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
ప్రతి పౌరుడు కూడా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను (Sardar Vallabhbhai Patel) ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో నడవాలని వికాస్ మహతో సూచించారు. యువత ఎటువంటి దుర్వ్యసనాలకు లోనుకాకుండా దేశానికి ఉపయోగపడే పనులు చేయాలని పేర్కొన్నారు. అయితే 2కే రన్ పెగడాపల్లి చౌరస్తా నుంచి ప్రారంభమై అంబేడ్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అదేవిధంగా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ (Bodhan Rural Police Station) పరిధిలో సాలూర క్యాంప్ నుంచి జాడి వరకు 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ తహశీల్దార్ విఠల్, టౌన్ సీఐ వెంకట్ నారాయణ, ప్రైవేట్ విద్యాసంస్థల డైరెక్టర్లు దుష్యంత్, శ్రీనివాస్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

