ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    CP Sai Chaitanya | మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ సాయి చైతన్య పిలుపునిచ్చారు. యాంటీ డ్రగ్స్​ అవేర్​నెస్​ వీక్​లో (Anti Drugs Awareness Week) భాగంగా పాత కలెక్టరేట్​ గ్రౌండ్​ నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్​శాఖకు ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

    CP Sai Chaitanya | రాష్ట్రంలో 15 లక్షల మంది..

    రాష్ట్రంలో 2015 వరకు 15 లక్షల మంది డ్రగ్స్​కు బాధితులుగా మారినట్లు రికార్డులు చెబుతున్నాయని సీపీ సాయిచైతన్య వివరించారు. ​యువత ఫ్యాషన్​ కోసం గంజాయి సేవిస్తున్నట్లు తెలుస్తోందని.. జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దని హితవు పలికారు. మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. యాంటీ డ్రగ్స్​ ర్యాలీ పాత కలెక్టరేట్​ గ్రౌండ్​ నుంచి ప్రారంభమై రాజీవ్​గాంధీ ఆడిటోరియం వరకు సాగింది.

    కార్యక్రమంలో ట్రైయినీ ఐఏఎస్ కరోలిన్​, అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, డిస్ట్రిక్ట్​ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్​ మల్లారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, విద్యార్థులు, ఎన్​సీసీ కేడెట్లు, అంగన్​వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

    ర్యాలీని ప్రారంభిస్తున్న సీసీ సాయిచైతన్య

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...