అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : National Unity Day | సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ రన్ నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ (Collectorate) వద్ద శుక్రవారం ఉదయం కలెక్టర్ జెండా ఊపి యూనిటీ రన్‌ను ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా బైపాస్ రోడ్‌లోని రిలయన్స్ మాల్ వద్ద వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ (Sardar Vallabhbhai) స్ఫూర్తితో ప్రజలందరూ ఐక్యతగా ఉండాలని సూచించారు. ఆయన స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలన్నారు.
National Unity Day | రాజ్యాలను ఏకం చేసిన ధీరుడు పటేల్: సీపీ సాయిచైతన్య
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) మాట్లాడుతూ దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో, బోధన్, ఆర్మూర్ డివిజన్లలో పోలీస్ శాఖ (Police Department) ఆధ్వర్యంలో యూనిటీ ర్యాలీలను నిర్వహించడం జరిగిందన్నారు. చిన్నచిన్న రాజ్యాలను ఒక తాటిపైకి తెచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్‌దేనని కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా ఐక్యతను చాటుతూ యువత ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి, ఇతర పోలీసు అధికారులు అధికసంఖ్యలు యువత పాల్గొన్నారు.


