Homeజిల్లాలునిజామాబాద్​Cyber Crime | సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి

Cyber Crime | సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి

సైబర్​ నేరగాళ్ల పట్ల యువతీయువకులు అప్రమత్తంగా ఉండాలని వన్​టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి పేర్కొన్నారు. నగరంలోని నిషిత డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cyber Crime | సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) పేర్కొన్నారు. నగరంలోని నిషిత డిగ్రీ కళాశాలలో (Nishitha Degree College) డిజిటల్ అరెస్ట్ (Digital arrest) మోసాలపై విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో పలువురు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారన్నారు.

Cyber Crime | సైబర్​ ఉచ్చులో చిక్కుకోవద్దు..

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా యువత అప్రవత్తంగా ఉండాలని ఎస్​హెచ్​వో సూచించారు. సైబర్ మోసగాళ్లు ఇటీవల పోలీస్ యూనిఫాంలో వీడియో కాల్ చేస్తూ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పేరు చెప్పి డ్రగ్స్​కు అలవాటు పడ్డారని, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డారని బెదిరిస్తున్నారని చెప్పారు. వారిపై అరెస్టు వారెంట్ జారీ అయిందని భయభ్రాంతులకు గురి చేస్తారన్నారని తెలిపారు.

మీ పిల్లలను అరెస్టు చేయకుండా ఉండాలంటే మా ఎకౌంటుకు నగదును బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తారని.. లేకపోతే అరెస్టు వారెంట్ జారీ చేస్తామని బెదిరిస్తారన్నారు. అలాంటి వాటికి అస్సలు భయపడవద్దని సూచించారు. అవన్నీ ఫేక్​ కాల్స్​ అని.. డిజిటల్​ అరెస్ట్​ అనేది ఇండియాలోనే లేదన్నారు. ఇలాంటి కాల్స్​ వచ్చినప్పుడు దగ్గర్లోని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిషిత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.