8
అక్షరటుడే, ఆర్మూర్: Armoor | రాత్రివేళ్లలో వేగంగా బైక్ నడుపుతూ న్యూసెస్స్ చేస్తున్న యువకుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గోల్ బంగ్లా ఔట్గల్లీకి చెందిన అబ్దుల్ అన్సార్ రోడ్డుపై న్యూసెన్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అతడికి కౌన్సెలింగ్ చేసి మంగళవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి గట్టు గంగాధర్ అబ్దుల్ అన్సార్కు 8 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని పోలీసులు తెలిపారు.