Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | పట్టాలు దాటుతుండగా ఢీకొన్న రైలు.. యువకుడి మృతి

Nizamabad City | పట్టాలు దాటుతుండగా ఢీకొన్న రైలు.. యువకుడి మృతి

రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఇందల్వాయి రైల్వే గేట్​ వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. రైల్వే ఎస్​హెచ్​వో సాయిరెడ్డి (Railway SHO Sai Reddy) కథనం ప్రకారం.. ఇందల్వాయి రైల్వే గేట్​ వద్ద ఓ యువకుడు రైలు వస్తుండగా దానిని గమనించకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడిని రైలు ఢీకొట్టింది.

తీవ్రగాయాల పాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన మొబైల్ ద్వారా కోటగిరి మండలం (Kotagiri mandal) రాయకూరు గ్రామానికి చెందిన నీరడి సురేష్ (30)గా గుర్తించారు. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ సాయి కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు  ఆయన పేర్కొన్నారు.

Must Read
Related News