అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోంది. ఎంతో మంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా నగరంలో డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ఓ యువకుడు మృతి చెందాడు.
నగరంలోని రాజేంద్రనగర్ (Rajendranagar)కు చెందిన అహ్మద్ అలీ మొబైల్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. స్థానికంగా ఓ అపార్ట్మెంట్లో అలీ మరో ముగ్గురితో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. ఇందులో ఇద్దరు యువతులు ఉన్నారు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో అలీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతడి స్నేహితులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి డ్రగ్స్ తీసుకున్నట్లు తెలియడంతో పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే పోలీసులు రాగానే యువతులు పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని డ్రగ్స్ టెస్ట్ చేశారు. ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు
Hyderabad | ఇటీవల గచ్చిబౌలిలో..
నగరంలో డ్రగ్స్ పార్టీలు పెరుగుతున్నాయి. విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుండటంతో యువత వాటికి బానిసలు మారుతున్నాయి. ఎంజాయ్ కోసం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో కొందరు డ్రగ్ పార్టీ నిర్వహిస్తుండగా.. ఎస్వోటీ పోలీసులు దాడులు (SOT Police Raids) చేశారు. మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక (Karnataka) నుంచి తెచ్చి హైదరాబాద్ లోని యువకులకు డ్రగ్స్ విక్రయిస్తున్న స్మగ్లర్ గుత్తా తేజకృష్ణతో పాటు మరో నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా రాజేంద్ర నగర్లో డ్రగ్స్ పార్టీ జరగ్గా.. ఓ యువకుడు మృతి చెందాడు.
