HomeతెలంగాణNizamabad City | చదువుపై ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య

Nizamabad City | చదువుపై ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad City | చదువుపై అనాసక్తితో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని నాల్గో టౌన్​ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని రోటరీనగర్​లో ​(Rotary Nagar) నివాసముండే శ్రీనివాస్​కు ఒక కూతురు, ఒక కొడుకు రాజేశ్వర్​ ఉన్నారు. రాజేశ్వర్ ప్రస్తుతం పదో తరగతి ఫెయిల్​ అయినప్పటికీ సప్లిమెంటరీ పరీక్షలు రాసి తిరిగి పాసయ్యాడు. అనంతరం ఇంటర్​లో జాయిన్​ కావాలని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ రాజేశ్వర్​ వినలేదు.
చదువుకుంటే ఉన్నతస్థానానికి వెళ్లవచ్చని.. సమాజంలో మంచిపేరు వస్తుందని తల్లిదండ్రులు రాజేశ్వర్​కు నిత్యం చెబుతుండేవారు.

కానీ రాజేశ్వర్​కు మాత్రం చదువుపై ఏమాత్రం ఆసక్తి లేకుండాపోయింది. చివరికి చదువుపై అనాసక్తితో గురువారం ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న నాల్గో టౌన్​ పోలీసులు (Fourth Town Police) ఘటనా స్థలానికి చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్​కు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.