అక్షరటుడే, కామారెడ్డి : Bike hitting railing : జాతీయ రహదారి(national highway)పై రెయిలింగ్‌ను ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy district) సదాశివనగర్ మండలం(Sadashivanagar mandal) మర్కల్ గ్రామ(Markal village) శివారులో చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన కరడ్పల్లి కార్తీక్ రావు(25) కామారెడ్డి నుంచి గ్రామానికి బైకుపై వెళ్తుండగా.. మర్కల్ చౌరస్తా అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు(Police) ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.