అక్షరటుడే, ఆర్మూర్: Armoor | గృహ నిర్మాణ పనులు (house construction work) చేస్తుండగా విద్యుత్‌షాక్ కొట్టి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ (Armoor SHO Satyanarayana Goud) తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రానికి చెందిన కుమార లహరి (35) పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు.
ఈ క్రమంలో తన చేతిలోని అల్యూమినియం పట్టి బిల్డింగ్‌పై ఉన్న వైర్లకు తాకింది. దీంతో కరెంట్‌షాక్ కొట్టి పడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
