Reels | రీల్స్ చేస్తూ క్వారీలో పడి యువకుడి దుర్మరణం

అక్షరటుడే, హైదరాబాద్: Reels : మేడ్చల్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రీల్స్ చేస్తూ ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం అటవీ ప్రాంతంలో గల నీటి క్వారీలో పడి తరుణ్ (17) అనే యువకుడు మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా, కౌకూర్ భరత్ నగర్ కాలనీకి చెందిన ఆరుగురు యువకులు రీల్స్ చేయడం కోసం కెమెరా తీసుకొని జవహార్ నగర్ లోని అడవి ప్రాంతంలో గల క్వారీకి వెళ్లారు. అక్కడ […]

అక్షరటుడే, హైదరాబాద్: Reels : మేడ్చల్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రీల్స్ చేస్తూ ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం అటవీ ప్రాంతంలో గల నీటి క్వారీలో పడి తరుణ్ (17) అనే యువకుడు మృతి చెందాడు.

మేడ్చల్ జిల్లా, కౌకూర్ భరత్ నగర్ కాలనీకి చెందిన ఆరుగురు యువకులు రీల్స్ చేయడం కోసం కెమెరా తీసుకొని జవహార్ నగర్ లోని అడవి ప్రాంతంలో గల క్వారీకి వెళ్లారు. అక్కడ ఫొటోషూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు క్వారీలోని నీటి గుంతలో తరుణ్ పడిపోయాడు. ఈత రాకపోవడంతో అందులోనే మునిగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

DK Aruna comments | ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి: ఎంపీ డీకే అరుణ

ఎమ్మెల్యే కేవీఆర్​పై ఆరోపణలు చేసిన షబ్బీర్​అలీ వాటిని నిరూపించి చూపించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో కేవీఆర్​ను ఆమె పరామర్శించారు.

Helmet Bank | ఉచితంగా హెల్మెట్.. ఎక్కడో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Helmet Bank | బైక్​పై వెళ్లేటప్పుడు హెల్మెట్​ లేకపోతే పోలీసులు ఫైన్​ వేస్తారు. ఇక్కడ మాత్రం అలా కాదు. ఉచితంగా...

Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన సీపీ

పోలీస్​ ప్రజావాణిలో భాగంగా సోమవారం సీపీ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య 30 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం పోలీస్​డ్యూటీ మీట్​లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించారు.

Harish Rao contractor payments | చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao contractor payments | రాష్ట్ర ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు...