Bodhan
Bodhan | వాటర్ ట్యాంకర్ ఢీకొని యువకుడి మృతి

అక్షరటుడే, బోధన్ : Bodhan | వాటర్​ ట్యాంకర్​ ఢీకొని హైదరాబాద్​(Hyderabad)లో బోధన్​ వాసి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సాలూర మండలం (Saloora Mandal) హున్సాకు చెందిన నందకుమార్​(21) హైదరాబాద్​లో పనిచేస్తున్నాడు.

అయితే శనివారం నగరంలోని పటాన్​చెరు మీదుగా విధులకు వెళ్తుండగా.. వాటర్​ ట్యాంక్​(Water Tank) ఢీకొట్టింది. దీంతో అయన అక్కడికక్కడే మృతిచెందాడు. నందకుమార్​ తండ్రి ఏడాది క్రితమే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్​చెరు ప్రభుత్వ ఆస్పత్రికి (Patancheru Government Hospital) తరలించారు. విషయం తెలుసుకున్న బోధన్​లోని ఆయన కుటుంబీకులు, బంధువుల హైదరాబాద్​ వెళ్లారు.