అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | బస్సును వెనుక నుంచి ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. హాజీపూర్ వద్ద ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (Palle Velugu bus) కామారెడ్డి నుంచి పిట్లం వైపు వెళ్తోంది.
మార్గమధ్యంలో హాజీపూర్ గ్రామంలో (Hajipur village) ఓ ప్రయాణికుడిని దింపే క్రమంలో బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. బస్సు వెనకే వస్తున్న మాదిగ కాశీరాం(32) బస్సును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కాశీరాం లింగంపేట మండలం మంబాజీపేటకు చెందినవాడిగా గుర్తించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
