Uppal
Uppal | బీర్​ బాటిల్​తో దాడి.. యువకుడి మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్:Uppal | బీర్​ బాటిల్​(Beer bottle)తో తలపై కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఉప్పల్​ పోలీస్​ స్టేషన్​(Uppal Police Station) పరిధిలో చోటు చేసుకుంది.

రామంతపూర్‌లోని శ్రీ గుడ్ డే బార్‌(Sri Good Day Bar)లో అంబర్​పేట్​ పటేల్​నగర్​కు చెందిన హరి, పవన్​, శ్రవణ్​ అనే ముగ్గురు మిత్రులు మద్యం తాగారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయలో హరి, శ్రవణ్​ గొడవపడ్డారు. వారిని ఆపడా నికి వెళ్లిన పవన్​పై శ్రవణ్​ బీర్​ బాటిల్​తో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ పవన్​ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.