Homeజిల్లాలునిజామాబాద్​Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేస్తామని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ (Vipul Goud) అన్నారు. శుక్రవారం యూత్ కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అధ్యక్షుడు యూనుస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీ పదవుల్లోనూ యువతకు పెద్దపీట వేస్తామని, యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. త్వరలో సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఈ వేదికగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శుభం, నగర ప్రధాన కార్యదర్శి మోసిన్ ఖాన్, నార్త్ మండల అధ్యక్ష ఉపాధ్యక్షుడు దినేష్ కుమార్, దీక్షిత్ కుమార్,రూరల్ మండల అధ్యక్షుడు సయీద్ ముదసిర్, సర్ఫరాజ్, అక్రం, ఫైజల్, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News