అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి అర్ధరాత్రి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ (Malkajgiri Police Station) పరిధిలో చోటు చేసుకుంది.
మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మంగళవారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. దమ్మాయిగూడ (Dammaiguda)కు చెందిన సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందిన మీన్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ (Drunk Drive) టెస్ట్‌లో అతడికి 120 పాయింట్లు వచ్చినట్లు చెప్పారు. కాగా మీన్‌రెడ్డి ఆత్మహత్యపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుతోనే మీన్‌రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
