అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు (private finance harassment) తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాచారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలంలోని (Machareddy mandal) చుక్కాపూర్ గ్రామానికి చెందిన రమేష్ భవన నిర్మాణ రంగంలో లేబర్‌గా పనిచేస్తున్నాడు.
2024 జూలైలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో (private finance) రమేష్ తన ఇంటిపై రూ.6 లక్షల లోన్ తీసుకున్నాడు. ఈఎంఐ రెగ్యులర్‌గా చెల్లించిన రమేష్ గత జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన ఈఎంఐలు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చెల్లించలేదు.
దాంతో కొద్ది రోజులుగా ఫైనాన్స్ కంపెనీ (finance company) ప్రతినిధులు ఫోన్లు చేస్తూ తరచుగా వేధింపులకు గురి చేస్తున్నారు. పైగా రమేశ్ ఇంటికి ‘ఈ ప్రాపర్టీ లీగల్ ప్రాసెస్‌లో ఉన్నది. దీనిపై ఎలాంటి లావాదేవీలు జరపరాదు’ అని ఫైనాన్స్ కంపెనీ పేరుతో నోట్ రాశారు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో దులానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా రమేశ్ భార్య సంధ్య మాట్లాడుతూ.. తన భర్త రమేశ్ ఫైనాన్స్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇలాంటి వేధింపులతో మరొక ప్రాణం పోకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుడు రమేష్‌కు కొడుకు అశ్విత్ కూతురు ఆద్య ఉన్నారు.