Homeక్రైంNizamabad City | ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

Nizamabad City | ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని గాయత్రినగర్​లో మంగళవారం చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షర టుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగో టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ శ్రీకాంత్‌ (SHO Srikanth) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాయత్రి నగర్‌కు (Gayatri Nagar) చెందిన మొతుకూరి కిషోర్‌ కుమార్‌ (39) నగరంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో వాచ్‌మెన్‌గా చేస్తున్నారు.

తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో చిన్నపాటి గొడవతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.