HomeతెలంగాణTraffic Police Station | ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో యువకుడి ఆత్మహత్యాయత్నం

Traffic Police Station | ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో యువకుడి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Traffic Police Station | నిజామాబాద్​ నగరంలోని ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో గురువారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన బాలాజీ అనే యువకుడు పాలిటెక్నిక్​ కాలేజీకి ఆనుకుని పానీ పూరి బండి నడుపుతూ జీవిస్తున్నాడు. అయితే ఇటీవల నగరానికి కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Union Home Minister Amit Shah) వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సభ పాలిటెక్నిక్​ గ్రౌండ్ (Polytechnic Ground)​లో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్​ పోలీసులు బాలాజీ పానీ పూరి బండిని అక్కడి నుంచి తీసేయించారు. అమిత్​ షా పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో తన పానీపూరి బండి (Panipuri Cart) పెట్టుకుంటానని గురువారం ఉదయం బాలాజీ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​​(Traffic Police Station)కు వెళ్లి అడిగాడు. అయితే అందుకు పోలీసులు అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్​ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు.

Traffic Police Station | ఆ ఘటన మరువకముందే..

నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్​లో ఓ యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అర్సపల్లికి చెందిన ఓ యువకుడిని పోలీసులు గంజాయి కేసులో అదుపులోకి తీసుకోగా.. పోలీస్​ స్టేషన్​లో ఫినాయిల్​ తాగాడు. అతడికి స్థానిక ఆస్పత్రిలో పోలీసులు చికిత్స చేయించినట్లు సమాచారం. అయితే ఆయనకు ఏమీ కాకపోవడంతో రిమాండ్​కు తరలించారు.

Must Read
Related News