అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal | భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Degree College) పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్న యువకులను ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ఎక్సైజ్ సీఐ వేణు మాధవరావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాల్లో నిత్యం గంజాయి సేవిస్తున్నారని అందిన సమాచారం మేరకు దాడులు చేశారు. కారేపల్లి గ్రామానికి చెందిన బుక్య రఘు 128 గ్రాముల పొడి గంజాయితో పట్టుబడ్డాడు. నిందితుడితోపాటు మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
గంజాయి విక్రయిస్తున్న నిందితుడు రఘును అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. అలాగే గంజాయి తాగుతున్న ముగ్గురు మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. శివారు ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్సై కే గోవర్ధన్, కానిస్టేబుళ్లు దత్తాద్రి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.