అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal | పట్టణంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సత్యనారాయణ గౌడ్ (CI Satyanarayana Goud) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కేసీఆర్ కాలనీలో (KCR Colony) నివాసముంటున్న అడికే వినీత్, రాయ్ సాగర్ అనే ఇద్దరు యువకులు నిర్మల్ జిల్లా (Nirmal District) భైంసా కుంట ఏరియాలో నివాసముంటున్న షేక్ మెహరాజ్ నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారని తెలిసింది.
కాగా భీమ్గల్(Bheemgal)లోని కేసీఆర్ కాలనీ వద్ద రెక్కి నిర్వహించగా బొలెరో వాహనం (Bolero Vehicle)లో అనుమానాస్పదంగా కనిపించిన వినీత్, రాయ్ సాగర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా.. నిందితులిద్దరూ తమ వద్ద ఉన్న ప్యాకెట్లు పడేసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు ప్యాకెట్ల రూపంలో ఉన్న 30 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసునమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు, మొబైల్ ఫోన్లను జప్తు చేశారు. కేసులో నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన భీమ్గల్ ఎస్సై సందీప్, మోర్తాడ్ ఎస్సై రాములను, సిబ్బందిని సీఐ అభినందించారు.