అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana RTC MD Sajjanar : ఫేమస్ కోసం, రీళ్ల కోసం యువత పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇటీవల రీళ్ల కోసం సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలు నుంచి ఓ యువతి జారిపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ఓ నదిలో యువతి కొట్టుకుపోయింది. మొన్నటికి మొన్న ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకుని రీల్ తీశాడు. తాజాగా మరో యువకుడు పట్టాలపై పడుకుని రీల్ చేసి వివాదాస్పదమయ్యాడు.
సదరు యువకుడు చేసిన ఘన కార్యాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం అని సజ్జనార్ అన్నారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!? అని ప్రశ్నించారు.
ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు..? ఇలాంటివి సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించాలని సజ్జనార్ సూచించారు.