అక్షరటుడే, బోధన్ : Youth Against Drug Abuse | యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని.. వాటి కారణంగా జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ సాయిచైతన్య సూచించారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోధన్ (Bodhan) పట్టణంలో యువతకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీపీ హాజరై మాట్లాడారు.
Youth Against Drug Abuse | డ్రగ్స్‌తో కుటుంబాలు నాశనం..
ఈ సందర్భంగా సీపీ (CP Sai Chaitanya) మాట్లాడుతూ డ్రగ్స్ కారణంగా వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అయిన సందర్భాలు ఉన్నాయన్నారు. సమాజానికి కూడా డ్రగ్స్ కారణంగా తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. మత్తుపదార్థాలపై విద్యార్థులకు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సరదాగానో, స్నేహితులు ప్రలోభపెట్టారని యువత మత్తుపదార్థాలు జోలికి వెళ్లవద్దని.. కెరీర్‌ను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.
Youth Against Drug Abuse | డ్రగ్స్ కారణంగా ఆరోగ్య సమస్యలు..
మత్తు పదార్థాల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని సీపీ అన్నారు. చదువుపై శ్రద్ధ ఉండదని కుటుంబంతో సరైన సంబంధాలు ఏర్పరచుకోలేరని ఆయన యువతకు సూచించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గమనించి వెంటనే వారికి సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ (Telangana) సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్టుగా అనుమానం వస్తే, డ్రగ్స్ సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1098కు ఫోన్ చేసి చెప్పాలని.. వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ కవిత రెడ్డి, ట్రెజరర్ సంతోష్ ఆర్గనైజింగ్ సెక్రెటరీలు దుష్యంత్, శిరీష్, హితిన్, ఉషారాణి, సభ్యులు కొడాలి కిషోర్, సాంబిరెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas), ఎస్‌హెచ్‌వో వెంకటనారాయణ, రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూరు సీఐ కృష్ణ (Rudrur CI Krishna), ఎస్సైలు భానుప్రకాష్, సందీప్ నార్కోటిక్ సభ్యులు మనోజ్, మహేష్, భాస్కర్, మచ్ఛేందర్ రెడ్డి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.