Hyderabad
Hyderabad | డ్రగ్స్​ అలవాటు ఉన్న యువతులే లక్ష్యం.. కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని కొండాపూర్​లో (Kondapru) పోలీసులు శనివారం రాత్రి రేవ్​పార్టీని భగ్నం చేసిన విషయం తెలిసిందే. మాదాపూర్​లోని ఓ విల్లాలో రేవ్​ పార్టీ (Rave Party) నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన అశోక్​ కుమార్​ ఈ రేవ్​ పార్టీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు తాజాగా ఆయనను అరెస్ట్​ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

Hyderabad | ప్రతివారం పార్టీలు

ఏపీకి చెందిన అశోక్​ కుమార్​ బడాబాబులే లక్ష్యంగా రేవ్​ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రతివారం ఏపీ (AP) నుంచి యువతి, యువకులను రప్పించి హైదరాబాద్​ నగరంలో పార్టీలు అరెంజ్​ చేస్తున్నాడు. డ్రగ్స్​ అలవాటు ఉన్న యువతులే లక్ష్యంగా ఆయన వీటిని ఏర్పాటు చేస్తున్నాడు. మత్తుకు బానిసలైన యువతులను పిలిచి.. ఏపీకి చెందిన బడాబాబులతో పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన వద్ద డ్రగ్స్‌, గంజాయి, కండోమ్​ ప్యాకెట్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad | కారుకు ఎంపీ స్టిక్కర్​

రేవ్​ పార్టీ నిర్వహించిన అశోక్​ కుమార్​ కారుకు లోక్​సభ ఎంపీ (Lok Sabha MP) స్టిక్కర్​ ఉండడం గమనార్హం. తన ఫార్చునర్​ కారుకు ఎంపీ స్టికర్​ అతికించుకొని ఆయన తిరుగుతున్నాడు. ప్రతి వీకెండ్​లో ఆంధ్ర నుంచి యువతీయువకులను తీసుకొచ్చి హైదరాబాద్‌లో రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడు. దీని కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ స్టిక్కర్​ ఎక్కడి నుంచి దానిపై విచారిస్తున్న ఎక్సైజ్ అధికారులు (Excise officers) దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad | జోరుగా డ్రగ్స్​ దందా

హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్​ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్​ దందా యథేచ్ఛగా సాగుతోంది. వీటి నివారణకు ప్రభుత్వం ఈగల్​ టీం (Eagle Team) ఏర్పాటు చేసినా దందా మాత్రం ఆగడం లేదు. ఎంతో మంది వీటికి బానిసలుగా మారారు. ఇటీవల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​ యజమానిని డ్రగ్స్​ కేసులో ఈగల్​ టీం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నగరంలోని చాలా ప్రాంతాల్లో గంజాయి దొరుకుతోంది. ఇటీవల ఈగల్​ టీం డెకాయ్​ ఆపరేషన్​ నిర్వహించి గంజాయికి బానిసైన పలువురిని అదుపులోకి తీసుకుంది. యువత ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.