ePaper
More
    Homeఅంతర్జాతీయంViral Video | ట్రైన్‌కి వేలాడుతూ భ‌యంక‌ర సాహ‌సం చేసిన యువ‌తి.. చెమ‌ట‌లు ప‌ట్టేశాయిగా..!

    Viral Video | ట్రైన్‌కి వేలాడుతూ భ‌యంక‌ర సాహ‌సం చేసిన యువ‌తి.. చెమ‌ట‌లు ప‌ట్టేశాయిగా..!

    Published on

    అక్షర టుడే, వెబ్ డెస్క్:Viral Video | ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో (Social Media) రీల్స్ చేస్తూ ఫేమ‌స్ అవ్వాల‌ని చాలా మంది ఆరాట‌ప‌డుతున్నారు. పది మందిలో హీరో అనిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ మృత్యువాత ప‌డుతున్నారు. ఎవ‌రెన్ని చెప్పినా కూడా వారికి న‌చ్చిందే చేస్తున్నారు. అయితే వారి విన్యాసాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆ వెంటనే ఆగ్రహం కూడా వస్తుంటుంది. అబ్బాయిలే స్టంట్స్ చేశారంటే.. తింగ‌రోళ్లు అనుకోవ‌చ్చు. ఈ మ‌ధ్య అమ్మాయిలు కూడా స‌ర‌దా కోసం రిస్క్‌లు చేస్తున్నారు. ప్రాణాలు పోతాయని తెలిసినా.. ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు.

    Viral Video | ఏంటి ఆ స‌ర‌దా..

    షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు(Videos) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రైలుకు వేలాడుతూ ప్రమాదకర విన్యాసం చేస్తూ అంద‌రికి చెమ‌ట‌లు ప‌ట్టించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. స‌ద‌రు యువతి కదులుతున్న రైల్లో చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతి.. మధ్యలో చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. అప్పటిదాకా సీట్లో కూర్చున్న యువతి.. ఆ వెంటనే తలుపు వద్దకు వచ్చి నిలబడి పెద్ద స్టంటే చేసింది.

    డోర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఏకంగా తలుపునకు రెండు వైపులా ఉన్న ఇనుప రాడ్లను పట్టుకుని వెనక్కు వేలాడింది. అలా చాలా దూరం వరకూ వేలాడుతూ ఉండ‌గా రైలు ఒక్క‌సారి ఆగిపోవడంతో.. కిందకు దిగిపోయింది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఏమీ కాకపోవడంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

    ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు గానీ.. వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స‌ద‌రు యువ‌తిని (Young lady) తిట్టిపోస్తున్నారు. ఇంట్లో వాళ్ల భ‌యం ఏమి లేదా, జీవితాన్ని ఎందుకు అలా నాశ‌నం చేసుకుంటున్నావు? అని ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 లక్షలకు పైగా లైక్‌లు, 105 మిలియన్లకు పైగా వ్యూస్‌(105 million views)ను సొంతం చేసుకుంది.

    https://www.instagram.com/reel/DJM4cOltH5q/?utm_source=ig_embed&ig_rid=4798b2bb-2053-4b01-b62b-0d5303fd3bd9

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...