Homeక్రైంReels | రీల్స్​ చేసి ఫేమస్.. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

Reels | రీల్స్​ చేసి ఫేమస్.. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reels | ఇన్​స్టాగ్రామ్ instagram ​లో రీల్స్ reels​ చేసి ఫేమస్​ అయిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ఎన్టీఆర్ NTR​ జిల్లా విసన్నపేట మండలం ఏ కొండురు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మధుమతి(22) ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్​ చేసేది. ఈ క్రమంలో వేలాది మంది ఫాలోవర్లను followers సొంతం చేసుకుంది.

Reels | అదే కారణమా..?

అయితే ఆమెకు తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ప్రతాప్​కు అంతకుముందే పెళ్లి కావడం గమనార్హం. ఈ విషయం తెలిసిన మధుమతి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. అయినా కూడా ప్రతాప్​, మధుమతిని కలిసేవాడు.

ఈ క్రమంలో మధుమతి అమ్మమ్మ వాళ్లింట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. తమ కూతురును ప్రతాప్ చంపేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతాప్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Must Read
Related News