ePaper
More
    HomeజాతీయంPlane Crash | భర్త దగ్గరికి తొలిసారి వెళ్తూ.. విమాన ప్రమాదంలో యువతి మృతి

    Plane Crash | భర్త దగ్గరికి తొలిసారి వెళ్తూ.. విమాన ప్రమాదంలో యువతి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Plane Crash | అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. గుజరాత్​లోని అహ్మదాబాద్​ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం (Air India plane) టేకాఫ్​ అయిన కొద్ది సెకన్లలోనే క్రాష్ అయింది. ఈ ఘటనలో విమానంతో పాటు ఎంతోమంది ఆశలు, కలలు కూడా కూలిపోయాయి. పెళ్లి తర్వాత తన భర్త దగ్గరికి తొలిసారి వెళ్తున్న ఓ యువతి విమాన ప్రమాదంలో మృతి చెందింది.

    రాజస్థాన్​లోని బలోత్రా(Balotra)కు చెందిన ఖుష్బు రాజ్‌పురోహిత్​కు జనవరి 2025లో వివాహం అయింది. ఆమె భర్త లండన్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత వారు లండన్​(London city)లోనే నివాసం ఉండాలనుకున్నారు. ఆ యువతి తన భర్తతో గొప్ప జీవితాన్ని ఊహించుకుంది. అయితే పెళ్లి తర్వాత ఇక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఖుష్బు భర్త లండన్​ వెళ్లిపోయాడు. ఖుష్బు ఇక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో గురువారం తన భర్త దగ్గరికి తొలిసారి వెళ్లడానికి లండన్​ బయలుదేరింది.

    ఖుష్బు తండ్రి వచ్చి అహ్మదాబాద్​ విమానాశ్రయం(Ahmedabad Airport)లో ఆమెను దింపాడు. ఈ క్రమంలో ఎయిర్​ ఇండియా విమానంలో ఎక్కిన ఆమె ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి తన కూతరుతో ఎయిర్​పోర్ట్​లో ఫొటో దిగాడు. ఆ చిత్రాన్ని వాట్సాప్​ స్టేటస్​ పెట్టుకున్నాడు. లండన్​ వెళ్తున్న తన కూతురిని ఆశీర్వదించాడు. అల్లుడి దగ్గరకు వెళ్లి తమకు ఫోన్​ చేస్తుందనుకున్న కూతురు కొద్ది సేపటికి ప్రమాదంలో మరణించిందని తెలిసి గుండెలవిసేలా రోదించాడు ఆ తండ్రి.

    Latest articles

    Collector Kamareddy | కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పాలి

    అక్షరటుడే,లింగంపేట: Collector Kamareddy | కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్...

    Dinesh Kulachary | స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తాం

    అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachary | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body elections) కాషాయ జెండా ఎగరేయడం...

    National Rakta Veer Awards | కామారెడ్డి వాసులకు జాతీయ రక్తవీర్ పురస్కారాలు

    అక్షరటుడే, కామారెడ్డి: National Raktha Veer Awards | కామారెడ్డి పట్టణ వాసులకు జాతీయస్థాయిలో రక్తవీర్ పురస్కారాలు లభించాయి....

    All India Kisan Congress | కామారెడ్డి కాంగ్రెస్​ నాయకుడికి పాట్నా ఓటర్ అధికార్ ర్యాలీ బాధ్యతలు

    అక్షరటుడే, కామారెడ్డి: All India Kisan Congress | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి (Devunipally) గ్రామానికి చెందిన...

    More like this