అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్:Nizamabad City | క్షణికావేశంలో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘటన నగర శివారులోని 300 క్వార్టర్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 300 క్వార్టర్స్(300 Quarters) సమీపంలో నివాసముండే సంధ్య మంగళవారం తన భర్త లేబర్ పని నిమిత్తం వెళ్లిన తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు (Investigation) చేస్తున్నారు.