అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mancherial మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.
వారిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకే గ్రామానికి చెందిన వారు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఏమైందో ఏమో గాని ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం తెలిసి ఆమె ప్రియుడు సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Mancherial మనస్తాపంతో..
మంచిర్యాల జిల్లా దండేపల్లి (Dandepalli) మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన హితవర్షిణి ఘట్కేసర్ (Ghatkesar)లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె అదే గ్రామానికి చెందిన వినయ్ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని కలలు కన్నారు. అయితే వారిద్దరి మధ్య ఏమైందో ఏమోగాని హితవర్షిణి హైదరాబాద్లో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వినయ్ సైతం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమ జంట మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే వారి మృతికి గల కారణాలు తెలియరాలేదు. వారిద్దరి మధ్య గొడవ జరిగిందా.. పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.