HomeUncategorizedYellareddy | ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

Yellareddy | ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ప్రేమికుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు (Yellareddy Police) తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శబ్దల్‌పూర్‌ (Shabdalpur village) గ్రామానికి చెందిన బత్తుల రాంచందర్, గంగామణికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఇటీవల రాంచందర్‌ బంధువు మృతి చెందడంతో, ఈనెల 10న దశదిన కర్మ ఉండడంతో భార్యతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో పెద్ద కూతురు సావిత్రి(19) ఎప్పటిలాగే, ఉదయం 9 గంటలకు ఎల్లారెడ్డిలోని కంప్యూటర్‌ క్లాస్‌కు వెళ్లి, మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చింది.

అదే సమయంలో గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మయ్య రాంచందర్‌ ఇంటికి వచ్చాడు. ఎవరూ లేకపోవడంతో, గదిలోకి వెళ్లి చూడగా సావిత్రి ఫ్యాన్‌ ఉరేసుకుని కనిపించింది. ఆమె గదిలో సూసైడ్‌ నోట్‌ కనిపించింది. అందులో షెట్పల్లి సంగారెడ్డికి చెందిన మార్గపు ప్రదీప్‌ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని పేర్కొంది. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Must Read
Related News