ePaper
More
    Homeక్రైంAdilabad | ఆన్​లైన్​లో పరిచయమై.. బాలికను వేధించిన యువకులు

    Adilabad | ఆన్​లైన్​లో పరిచయమై.. బాలికను వేధించిన యువకులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Adilabad | ప్రస్తుతం సోషల్​ మీడియా(Social Media) యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరిలో చేతిలో స్మార్ట్​ ఫోన్​ ఉంది. అయితే తెలిసి తెలియని వయసులో కొందరు సోషల్​ మీడియాకు బానిసలు అవుతున్నారు. కొత్త వ్యక్తులతో ఆన్​లైన్​ చాటింగ్​ చేసి తర్వాత చిక్కుల్లో పడుతున్నారు. ఇలాంటి అమానుష ఘటన ఆదిలాబాద్​ (Adilabad) జిల్లాలో చోటు చేసుకుంది. స్నేహం పేరిట బాలికను పరిచయం చేసుకుని 12 మంది యువకులు ఆమెను వేధించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉండడం గమనార్హం.

    ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలంలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడు స్నేహం పేరిట సదరు బాలికతో ఆన్​లైన్​ చాటింగ్​ మొదలు పెట్టాడు. చాటింగ్‌ చేస్తూ క్రమంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత తన అసలు రూపం బయట పెట్టాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే మొత్తం చాటింగ్‌ (Chatting) వైరల్‌ చేస్తానని బ్లాక్​ మెయిల్​ చేశాడు.

    READ ALSO  Roja | కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం బాధ కలిగించింది.. లైవ్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న రోజా

    తనతో అశ్లీలంగా కాల్స్ చేసి మాట్లాడాలని వేధించాడు. తర్వాత ఆ వీడియో కాల్స్‌ (Video Calls) రికార్డ్ చేసి తన స్నేహితులకూ షేర్ చేశాడు. 12 మంది ఆ వీడియోలను షేర్​ చేసుకున్నారు. అంతేగాకుండా ఆ బాలిక పేరిట ఫేక్​ అకౌంట్​ ఓపెన్​ చేసి ఆ వీడియోలను సోషల్​ మీడియాలో పెట్టారా దుర్మార్గులు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వీడియోల్ని వెంటనే డిలీట్‌ చేయించినట్లు పోలీసులు తెలిపారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this