HomeUncategorizedTamil Nadu | మెడలో పాము.. చేతిలో బీరు బాటిల్​.. మందుబాబు హల్​చల్​ చూశారా..!

Tamil Nadu | మెడలో పాము.. చేతిలో బీరు బాటిల్​.. మందుబాబు హల్​చల్​ చూశారా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Tamil Nadu | వెర్రి వెయ్యి రకాలు అన్నట్లు.. కొందరు పిచ్చి పనులతో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంటారు. తాజాగా తమిళనాడులో ఓ యువకుడు మెడలో పాము వేసుకొని.. చేతిలో బీరు సీసా పట్టుకుని నడిరోడ్డుపై హల్​ చల్​ చేశాడు.

తమిళనాడులోని ధర్మపురి(Dharmapuri)లో సూర్య అనే యువకుడు మెడలో పాము(Snake) వేసుకుని వైన్​ షాప్(Wine shop)​కు వెళ్లాడు. అక్కడ బీర్​ కొనుగోలు చేసి పాముకు కొద్దిగా తాగించాడు. అనంతరం తాను తాగాడు. అంతేగాకుండా పాముకు ముద్దు పెట్టి, రోడ్డుపై పోయే వాహనాలను ఆపుతూ హంగామా సృష్టించారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.