Viral Video
Viral Video | ప‌ర్మీష‌న్ అడిగి మ‌రీ తాళి క‌ట్టిన యువ‌కుడు.. నువ్వు మ‌గాడురా బుజ్జి అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

అక్షర టుడే, వెబ్‌డెస్క్: Viral Video | ఈ రోజుల్లో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య బంధం (Husband – wife relation) ఎక్కువ రోజులు కొన‌సాగ‌డం లేదు. సామాన్యులు అయిన సెల‌బ్రిటీలు అయిన స‌రే వైవాహిక బంధంలో వ‌చ్చే చిన్న చిన్న పొర‌పొచ్చాల వ‌ల‌న పెళ్లైన కొన్నాళ్ల‌కే విడాకులు (Divorce) తీసుకుంటున్నారు. మ‌రి కొంద‌రు ఇష్టం లేకుండా వివాహం చేసుకొని ఆ త‌ర్వాత భ‌ర్త‌ని ఇబ్బందుల‌కి గురి చేస్తున్నారు. ఈ కాలంలో వివాహం అంటేనే విచిత్ర ఘటనలకు కేంద్రంగా మారిపోయింది. వధూవరుల మధ్య చోటు చేసుకునే అనేక రకాల ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా, వరుడు తాళి కట్టే ముందు ప‌ర్మీష‌న్ తీసుకునే వీడియో ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది.

Viral Video | అనుమ‌తితో..

తాళి కట్టే సమయంలో వరుడు వధువు అనుమతి తీసుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ వరుడు అసలు విషయాన్ని ముందే గ్రహించాడు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడు మ‌గాడు రా బుజ్జి అంటున్నారు. ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో (Social Media) ఈ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో (wedding ceremony) వధూవరుల మధ్య ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తాళి కట్టే సమయం రాగానే.. వరుడి చేతికి పురోహితుడు తాళిని అందించాడు సాధారణంగా ఎవరైనా తాళిని చేతిలోకి తీసుకున్న తర్వాత.. పైకి నిలబడి, దాన్ని అందరికీ చూపించిన తర్వాత వధువు మెడలో కడతారు.

అయితే ఈ వరుడు (groom) మాత్రం తాళి చేతిలోకి తీసుకున్న తర్వాత కూడా కూర్చొనే ఉంటాడు. దీంతో పక్కన ఉన్న వాళ్లు పైకి లేవమని చెబుతుంటారు. అయినా వరుడు అలాగే కూర్చుని ఉంటాడు. దీంతో పైకి లేచి తాళి కట్టమంటూ వాళ్లు మరోసారి సూచిస్తారు. అయినా వరుడు పైకి లేవకుండా చివరకు వధువు అనుమతి (bride permission) తీసుకుంటాడు. ప‌దేళ్లు ప్రేమించుకొని పెద్ద‌ల అనుమ‌తితో పెళ్లి చేసుకుంటున్న స‌మ‌యంలో అమ్మాయి త‌ల్లి దండ్ర‌లుని మిస్ అవుతుంద‌ని క‌న్నీరు పెట్టుకుంటుంది. అది గ‌మ‌నించిన వ‌రుడు తాళి క‌ట్ట‌నా అని అనుమ‌తి తీసుకొని ఆమెకి మూడు ముడులు వేస్తాడు. వ‌ధువు క‌న్నీటితోనే తాళిని క‌ట్టించుకొని ఆ త‌ర్వాత మెడ‌లో తాళి ప‌డ‌గానే సంతోంతో నవ్వేసింది. ఇలా తాళి కట్టే ముందు వధువు అనుమతి తీసుకోవడం.. అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.