అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sangaredddy | సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని ఇంటికి పిలిచి మరి తల్లిదండ్రులు కొట్టిచంపారు.
సమాజంలో నేర ప్రవృత్తి పెరిగింది. కొందరు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఎక్కువ శాతం హత్యలకు ప్రేమ వ్యవహరాలు, ఆస్తి తగదాలు, వివాహేతర సంబంధాలు కారణం అవుతున్నాయి. తమ కూతుర్ని ప్రేమిస్తున్న ఓ యువకుడిని తల్లిదండ్రులు దారుణంగా కొట్టి చంపారు.
Sangaredddy | పెళ్లి చేస్తామని పిలిచి..
జ్యోతి శ్రావణ్ సాయి (20) అనే యువకుడు మైసమ్మగూడ (Maisammaguda) లోబి సెయింట్ పీటర్ కాలేజీలో (St Peter college) బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. కుత్బుల్లాపూర్‌లో రూం తీసుకుని అద్దెకు ఉంటున్నాడు. సాయి కొంతకాలంగా బీరంగూడ (Beeramguda) ఇసుకబావికి చెందిన శ్రీజ (19)ను ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం శ్రీజ తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో కూతురిని ప్రేమించొద్దని పలుమార్లు సాయిని హెచ్చరించారు. అయినా వారు తమ ప్రేమను కొనసాగించారు. దీంతో ఇద్దరికీ పెళ్లి చేస్తామని నమ్మించి సాయిని శ్రీజ తల్లిదండ్రులు ఇంటికి పిలిపించారు. అనంతరం ఇంట్లోకి రాగానే దాడి చేశారు.
Sangaredddy | క్రికెట్ బ్యాట్‌తో..
ఇంట్లోకి రాగానే శ్రీజ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు క్రికెట్ బ్యాట్‌తో శ్రవణ్ సాయిని కొట్టారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి బయటకు పరుగు తీశాడు. అయినా కానీ ఇంట్లోకి లాక్కెళ్లి మరీ దాడి చేశారు. దెబ్బలకు తట్టుకోలేక శ్రావణ్ సాయి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు (Patancheru) ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.