అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులో శనివారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. పిట్లం మండలం అల్లాపూర్ (Allapur) గ్రామానికి చెందిన గైని పండరి(28) తన బైక్పై ప్రాజెక్టు వద్దకు వచ్చి గార్డెన్ లోపల పర్యాటకులు చూస్తుండగానే నీటిలో దూకాడు. ఎంతకు పైకి రాకపోవడంతో స్థానికులు నిజాంసాగర్ పోలీసులకు (Nizamsagar Police) సమాచారం అందించారు.
దీంతో ఎస్సై శివకుమార్ (SI Shiva kumar) ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద యువకుడికి చెందిన బైక్ మాత్రమే ఉంది. యువకుడు కావాలనే నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక నీటిలో దూకిన తర్వాత ఈతరాక మునిగిపోయాడా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
గల్లంతైన యువకుడు పండరి

