Homeజిల్లాలునిజామాబాద్​Birkur | చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతు

Birkur | చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతు

చేపల వేటకు వెళ్లిన యువకుడు మంజీరలో గల్లంతయ్యాడు. బీర్కూర్​ మండలంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, బీర్కూర్ : Birkur | చేపల వేటకు వెళ్లిన ఓ యవకుడు గల్లంతయ్యాడు. బీర్కూర్​ (Birkur) మండలంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి (Damarancha Village) చెందిన నర్సింలు స్థానికంగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద చేపలు పట్టేందుకు వెళ్లాడు.

అయితే చేపలు పట్టే క్రమంలో మంజీర నది (Manjira River)లో గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం నుంచి పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ యువకుడి ఆచూకీ లభించలేదు.

Must Read
Related News