HomeతెలంగాణGadwal | రీల్స్ పిచ్చి.. ట్రాక్టర్​పై పడుకొని డ్రైవింగ్..

Gadwal | రీల్స్ పిచ్చి.. ట్రాక్టర్​పై పడుకొని డ్రైవింగ్..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gadwal | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది చనిపోతున్నారు. అయినా చాలా మంది ట్రాఫిక్​ నిబంధనలు (Traffic Rules) పాటించడం లేదు. పలువురు అయితే ప్రమాదకరంగా రోడ్లపై వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను సైతం రిస్క్​లో పెడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే జోగులాంబ(Jogulamba) గద్వాల్​ జిల్లాలో చోటు చేసుకుంది.

గద్వాల(Gadwal) జిల్లా మానవపాడు మండల పరిధి 44వ జాతీయ రహదారిపై ఓ యువకుడు ట్రాక్టర్(Tractor)​ను ప్రమాదకరంగా డ్రైవ్​ చేశాడు. ట్రాక్టర్​పై తాపీగా పడుకొని నడుపుతూ వెళ్లాడు. వెనకాల వస్తున్న ఓ వాహనదారుడు దీనిని వీడియో తీశాడు. ఆ వీడియో కాస్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. నడిరోడ్డుపై ఇలా వాహనం నడిపితే ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.