అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahabubabad | ఎన్నో ఆశలతో ఒక్కటైన ఆ జంటను రెండు రోజులకే విధి విడదీసింది. ఎన్నో ఆశలు.. వందేళ్లు కలిసి బతకాలని వారు కన్న కలలను కల్లలు చేసింది. పెళ్లి చేసుకొని భార్యతో కొత్త జీవితం ప్రారంభించిన ఓ యువకుడిని కరెంట్ షాక్ Electric shock రూపంలో మృత్యువు బలిగొంది. మహబూబాబాద్ Mahabubabad జిల్లా బయ్యారం bayyaaram మండలం కోడిపుంజుల తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్‌కు రెండ్రోజుల క్రితం కృష్ణాజిల్లా krishna district కంకిపాడులో వివాహం అయింది. వివాహం చేసుకొని ఇంటికి వచ్చిన నరేశ్ మంగళవారం కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది.
