అక్షరటుడే, నిజాంసాగర్ : Mohammed Nagar | రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మద్ నగర్ (Mohammed Nagar) మండలం హసన్‌పల్లి గ్రామానికి చెందిన గంజి అంజయ్య(30) ఎల్లారెడ్డి నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆయన బైక్‌ను కారు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అంజయ్యను కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్ (Hyderabad) తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
