5
అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలోని జిల్లా పరిషత్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మూడో టౌన్ ఎస్సై హరిబాబు(3rd Town SI Haribabu) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హమాల్ వాడికి చెందిన బీటెక్ విద్యార్థి మందుల ఆకాష్(21) ఆదివారం రాత్రి తన స్నేహితుడు దీపక్ ఇంట్లో శుభకార్యంలో పాల్గొన్నాడు. తిరిగి అర్ధరాత్రి ఖలీల్‌వాడి వైపు వెళ్తుండగా.. జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఆటో ఢీకొట్టింది. దీంతో ఆకాష్ తలకు బలమైన గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.