అక్షరటుడే, ఆర్మూర్: Road Accident | నందిపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జోర్పూర్ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో యువకుడు మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. నందిపే మండలంలోని ఖుద్వాన్పూర్కు చెందిన బేగరి పోశెట్టి(30), అతని తల్లి బేగర సునీత ఇద్దరు కలిపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో పోశెట్టి మృతి చెందాడు. అతని తల్లి సునీతకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

