Homeజిల్లాలునిజామాబాద్​Banswada | ఉరేసుకొని యువకుడి బలవన్మరణం

Banswada | ఉరేసుకొని యువకుడి బలవన్మరణం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వర్ని మండలంలో (varni Mandal) మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై మహేష్​ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జాకోరా (jakora) గ్రామానికి చెందిన కమ్మరి సతీష్​(40) ఫొటోగ్రాఫర్​గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కాని అప్పటికే సతీష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.