Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య

Nizamabad | ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలం అయిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్​ నగరంలో చోటు చేసుకుంది. నాలుగో టౌన్​ ఎస్సై శ్రీకాంత్ (SI Srikanth) తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్​పల్లి (Dichpalli) మండలం గొల్లపల్లికి చెందిన ఆకాష్ నగరంలోని వినాయకుల బావి దగ్గర అద్దెకు ఉంటున్నాడు.

ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఆకాష్ ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ప్రేమ విఫలమై వాళ్ల ఇంట్లో గొడవలు జరగడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News