ePaper
More
    HomeతెలంగాణSiddipet | బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

    Siddipet | బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Siddipet | ప్రస్తుతం కొంతమంది యువత లగ్జరీ లైఫ్(Luxury Life)​ కావాలనుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టాలను పట్టించుకోకుండా తాము అనుకున్నది కావాలని పట్టుబడుతున్నారు. సోషల్​ మీడియా(Social Media)కు బానిసలుగా మారి.. అందులో ఇతరులకు ఉన్నట్లు తమకు ఫోన్లు, కార్లు, బైక్​లు కావాలని తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు వాటిని కొనివ్వలేక సతమతం అవుతున్నారు. తాజాగా ఓ యువకుడు బీఎండబ్ల్యూ కారు(BMW Car) కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.

    సిద్దిపేట(Siddipet) జిల్లా జగదేవ్​పూర్ మండలం చాట్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య, కనకమ్మ దంపతులకు కుమారుడు జానీ(21) ఉన్నాడు. పదో తరగతి వరకు చదివిన యువకుడు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నాడు. అయితే జానీ కొంతకాలంగా తనకు బీఎండబ్ల్యూ కారు కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకొని బతికే తమకు అంత స్థోమత లేదని వారు చెప్పినా వినడం లేదు. దీంతో స్విఫ్ట్ డిజైర్​ కారు కొనిస్తామని తల్లిదండ్రులు చెప్పారు. తాను అడిగిన కారు కొనివ్వడం లేదని మనస్తాపానికి గురైన జానీ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...