అక్షరటుడే, వెబ్డెస్క్: Heart Attack | దేశవ్యాప్తంగా గుండెపోటుతో మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత గుండెపోటుకు గురి అవుతుండడం గమనార్హం. అప్పటి వరకు బాగానే ఉండి.. ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఇటీవల ఇలాంటి మరణాలు పెరగడం కలవర పెడుతోంది. తాజాగా ఓ యువకుడు షటిల్ ఆడుతూ.. కుప్ప కూలిపోయాడు.
ఖమ్మం జిల్లా (Khammam District) తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్(25) హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆయన ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి రాకేష్ నాగోల్ స్టేడియంలో (Nagole Stadium) స్నేహితులతో కలిసి షటిల్ (Shuttle) ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఆడుతూనే ఆయన కుప్ప కూలిపోయాడు. స్నేహితులు వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Heart Attack | పెరుగుతున్న గుండెపోట్లు
దేశవ్యాప్తంగా గుండెపోటుతో మరణాలు పెరుగుతున్నాయి. గతంలో వయసు పైబడిన వారికి ఎక్కువగా హార్ట్ ఎటాక్(Heart Attack) వచ్చేది. అది కూడా రెండు మూడు సార్లు వచ్చాక కానీ మరణించే వారు కాదు. అయితే ఇటీవల యువత, టీనేజీ వారికి కూడా గుండెపోట్లు వస్తున్నాయి. గుండెపోటు రాగానే మృతి చెందుతుండడం గమనార్హం.
ఇటీవల నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో ఇరిగేషన్ ఏఈఈ నితిన్ (AEE Nithin) ప్రాజెక్ట్ నీటి మట్టం పరిశీలించేందుకు వెళ్లి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఆయన వెంటనే మరణించాడు. గతంలో ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ.. సిక్స్ కొట్టి హార్ట్ ఎటాక్ వచ్చి మరణించాడు. యువతకు గుండెపోట్లు పెరగడంపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు కారణాలను అన్వేషించి నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు.
View this post on Instagram